తెలంగాణకు రైల్ కోచ్ యూనిట్.. వెయ్యి కోట్ల పెట్టుబడి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు రైల్ కోచ్ యూనిట్.. వెయ్యి కోట్ల పెట్టుబడి

May 25, 2022

తెలంగాణకు విభజన హామీల్లో ఒకటైన ఖాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాలేదు కానీ, ప్రైవేటు రంగంలో మాత్రం ఓ యూనిట్ రానుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్ రైల్ కంపెనీ తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడితో యూనిట్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్ ఫోరంలో ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ కంపెనీ హైదరాబాదుకు చెందిన సర్వో డ్రైవ్స్‌తో కలిసి జాయింట్ వెంచర్ కింద ఈ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ కోచ్ తయారీ యూనిట్ ద్వారా రాష్ట్రంలో 2500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పింస్తుందని కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మరోసారి నిరూపించిందని వెల్లడించారు.