Railway job for 10-month-old child..this is the reason
mictv telugu

10 నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం..కారణం ఇదేనట

July 8, 2022

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఓ అరుదైన కారుణ్య నియామకం చేపట్టింది. 10 నెలల చిన్నారికి రైల్యేశాఖలో ఉద్యోగాన్ని కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. అదేంటి 10 నెలల చిన్నారికి రైల్యే ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అని అనుకుంటున్నారా..అవునండి మీరు చదివింది నిజమే. ఈ అరుదైన కారుణ్య నియామకంపై అధికారులు పూర్తి వివరాలను గురువారం మీడియా ముందు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని ఆగ్నేయ మధ్య రైల్వేలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల బాలిక రాధికకు ఉద్యోగం కల్పించాం. చిన్నారి ఉద్యోగానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను బుధవారమే పూర్తి చేశాం. అంతేకాదు రాధిక వేలి ముద్రలను కూడా సేకరించాం. చిన్నారికి 18 ఏళ్లు నిండాక ఉద్యోగంలో చేరేందుకు అర్హురాలు అవుతుంది. ఆగ్నేయ మధ్య రైల్వే చరిత్రలోనే ఈ నియామకం ఓ ప్రత్యేకమైంది. ఇంత చిన్న వయసులో కారుణ్య నియామకం ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం చేపట్టడం చరిత్రలోనే ఓ రికార్డ్” అని అధికారులు అన్నారు.

అయితే, అ చిన్నారికి ఇంత చిన్న వయసులో ఉద్యోగం ఇవ్వడానికి ప్రధాన కారణం..రాధిక తండ్రి రాజేంద్ర కుమార్ యాదవ్ రైల్వే ఉద్యోగి. జూన్ 1న కుటుంబంతో కలిసి భిలాయ్ వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రకుమార్, ఆయన భార్య అక్కడికిక్కడే ప్రాణాలు కోల్పోగా, రాధిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి ఆపన్నహస్తంగా రైల్వేశాఖ అధికారులు చిన్నారికి ఉద్యోగాన్ని కల్పిస్తూ, సంచలన నిర్ణయం తీసుకున్నారు.