Railway Jobs has no place for non-performers, Indian Railways removed 177 officials in past year
mictv telugu

మూడు రోజులకు ఓ రైల్వే ఉద్యోగిపై వేటు

November 24, 2022

విధుల్లో అలసత్వం వహించి, అవినీతికి పాల్పడుతున్న వారిపై ఇండియన్ రైల్వే కొరడా ఝులిపిస్తుంది. అటువంటి అధికారులను ఇంటికి పంపుతుంది. ఇవే కారణాలతో గత 16 నెలలుగా ప్రతీ మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడింది. తాజాగా బుధవారం మరో ఇద్దరి అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. ఇందులో ఒకరు హైదరాబాద్‌లో రూ.5లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కగా.. మరో అధికారి రాంచీలో రూ.3లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. రైల్వే శాఖ 2021 జులై నుంచి ఇప్పటి వరకు 139 మంది ఉద్యోగులను బలవంతంగా వీఆర్‌ఎస్‌ ఇచ్చి పంపించగా.. మరో 38 మంది ఉద్యోగులను విధుల నించి తొలగించనున్నట్లు రైల్వే అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఉద్యోగుల పనితీరుపై కఠినంగా ఉండాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారి తెలిపారు.