నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వే శాఖలో ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు చెప్పింది దక్షిణమధ్య రైల్వే. భారీగా ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మొత్తం 4వేల అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్న దక్షిణమధ్య రైల్వే…అర్హత, ఆసక్తి కలిగి అభ్యర్థులు అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేస్తుకోవాలని తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి ప్రారంభం అయ్యింది. జనవరి 29ని ఆఖరి తేదీ అప్లయ్ చేసుకోవడానికి.
ఖాళీలు
-ఏసీ మెకానిక్ 250
-కార్పెంటర్ 18
-డిజిల్ మెకానిక్ 531
-ఎలక్ట్రీషియన్ 1019
-ఎలక్ట్రానిక్ మెకానిక్ 92
-ఫిట్టర్ 1460
-మెషినిస్ట్ 71
-మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 5
-మిల్ రైట్ మెయింటెనెన్స్ 24
-పెయింటర్ 80
-వెల్డర్ 553
నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు 50శాతం మార్కులతో పదవతరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థలు డిసెంబర్ 30,2022 నాటికి కనిష్టంగా 15ఏళ్లు గరిష్టంగా 24ఏళ్లు నిండి ఉండాలి.
వయోపరిమితి సడలింపు
ఓబిసి అభ్యర్థులు- 3 సంవత్సరాల
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు- 5 సంవత్సరాల
పీడబ్ల్యూ డి అభ్యర్థులు- 10 సంవత్సరాలు
రుసుము
ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ మహిళా అభ్యర్థులకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
మిగతా అభ్యర్థులు 100రూపాయలు చెల్లించాలి.
ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
జీతం, ఉద్యోగ స్థలం
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. ఏపీ, తమిళనాడు, కర్నాట, తెలంగాణలో పోస్టింగ్స్ ఉంటాయి.
దరఖాస్తు చివరి తేదీ
జనవరి 29, 2023.