రైల్వే స్టేషన్‌లో అనకొండ! - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వే స్టేషన్‌లో అనకొండ!

October 31, 2017

జనం చిన్న పామును చూసినా హడలిపోతారు. అదే ప్రాణాంతకమైన అనకొండను చూస్తే? అదీ పట్టపగలు, రైల్వే స్టేషన్లో చూస్తే? ఇంకేముంది పరుగో పరుగు కదా. కానీ ఈ వీడియో చూడండి. ఇందులో భయంకరమైన ‘అనకొండ’ ఎలా వేలాడుతోందో. కానీ జనం మాత్రం పారిపోకుండా దాని దగ్గిరకొచ్చి మరీ ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఈ సీన్ కనిపించిందని సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. అయితే అక్కడ అలాంటి పామేమీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. బహుశా ఇది మన దేశంలోనే ఏదో రైల్వే స్టేషన్లో వేలాడుతున్న భారీ కొండ చిలువ కావచ్చని కొందరు చెబుతున్నాయి. భారతదేశంలో అనకొండలు లేవు. వాటిని పోలిన భారీ కొండచిలువలు కూడా అరుదే. మరైతే ఈ భారీ కొండచిలువ ఎలా వచ్చిందో అర్థం కాక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. ఈ వీడియో వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.