Railway tracks burnt by the heat of the sun in england
mictv telugu

ఎండ వేడికి కాలిపోయిన రైలు పట్టాలు

July 12, 2022

విపరీతంగా వర్షాలు పడుతుంటే ఎండ ఎక్కడుంది అనుకుంటున్నారా? అయితే ఈ ఘటన జరిగింది మన దేశంలో కాదు. ఇంగ్లండ్‌లో. అక్కడ ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. మన దగ్గర గరిష్టంగా 50 డిగ్రీల ఎండ ఉన్నా మనకు పెద్దగా నష్టం ఏమీ ఉండదు కానీ, అక్కడ మాత్రం కేవలం 34 డిగ్రీల ఎండకే రైలు పట్టాలు కాలిపోయాయి. వాండ్స్ వార్త్ రోడ్ – లండన్ విక్టోరియా మధ్య ఉన్న పట్టాలు సోమవారం మంటలు చెలరేగి కాలిపోయాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ధ‌ృవీకరించారు. అనంతరం ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ సకాలంలో స్పందించి మంటలు ఆర్పారని వెల్లడించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని, దీంతో పట్టాల నిర్వహణ సవాలుగా మారే ప్రమాదముందని సౌత్ ఈస్ట్రన్ రైల్వే ఎండీ స్టీవ్ వైట్ అభిప్రాయపడ్డారు.