Railways awards tender for supply of 39,000 train wheels to China company
mictv telugu

39 వేల రైలు చక్రాల కాంట్రాక్ట్ చైనా కంపెనీకి.. మేకిన్ ఇండియా ఇదేనా?

May 18, 2022

Railways awards tender for supply of 39,000 train wheels to China company

మేకిన్‌ ఇండియా పేరుతో స్వదేశంలోనే అన్ని రకాల ఉత్పత్తుల తయారీని అభివృద్ది చేస్తామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న మోడీ సర్కార్… ప్రతిష్టాత్మక వందేభారత్ రైళ్ల చక్రాల తయారీ ప్రాజెక్ట్‌ను కరోనా పుట్టిన దేశం చైనా కు అప్పగించింది. వందేభారత్‌ రైళ్ల కోసం 39 వేల రైల్వే చక్రాలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను చైనాకు చెందిన ఓ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పగించడం విశేషంగా మారింది. మొదట ఉక్రెయిన్‌కు చెందిన ఓ సంస్థకు ఈ చక్రాల తయారీ కాంట్రాక్ట్ ను ఆర్డర్ చేసింది భారతీయ రైల్వే. కానీ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వాటి తయారీ నిలిచిపోయింది. దీంతో చైనా సంస్థకు ఈ కాంట్రాక్ట్‌ను ఖరారు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. రూ.170 కోట్ల విలువైన ఈ కాంట్రాక్ట్‌కోసం ఏప్రిల్‌ 4న టెండర్లు ప్రారంభించగా, ఈ నెల 2న టెండరు ఖరారు చేశారు.

టిజి (తైజాంగ్‌) హంకాంగ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ అనే చైనా ప్రభుత్వ సంస్థకు ఈ కాంట్రాక్ట్‌ లభించింది.చైనాలోని షాంగై రాష్ట్రంలోని తైయువాన్‌ నగరంలోని తైయువాన్‌ హెవీ ఇండిస్టీ రైల్వే ట్రాన్సిట్‌ ఎక్విప్‌మెంట్‌ కంపెనీలో చక్రాలను తయారు చేస్తారు. టిజి (తైజాంగ్‌) హంకాంగ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ అనేది తైయూన్‌ హెవీ మిషనరీ గ్రూప్‌ కో లిమిటెడ్‌కు చెందిన అంతర్జాతీయ వ్యాపార విభాగం. అయితే గాల్వాలోయలో ఘర్షణ తరువాత ఉద్రిక్తతలు నెలకున్న నేపథ్యంలో గత ఏడాది జులైలో చైనా నుంచి పెట్టుబడులు, సరఫరాల విషయంలో కేంద్ర పరిమితులు విధించింది. అయినా ఈ ప్రాజెక్టును చైనా సంస్థకు అప్పగించడం గమనార్హం.