కరోనా ఎఫెక్ట్..అప్పటివరకూ ప్యాసింజర్ రైళ్ళకు బ్రేకులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్..అప్పటివరకూ ప్యాసింజర్ రైళ్ళకు బ్రేకులు

March 22, 2020

x cb vc b vcgb

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకూ అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. మార్చి 31 అర్ధరాత్రి వరకూ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. గూడ్స్ రైళ్లు మాత్రం యధాతధంగా నడువనున్నాయి. 

ప్రస్తుతం మహారాష్ట్రలో మృతుల సంఖ్య పెరగడంతో పాటు స్టేజ్ 3లోకి కరోనా బాధితులు ప్రవేశించడంతో రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా గత కొన్నిరోజులుగా దేశంలోని అన్ని రైల్వే జోన్లలోని 155 వరకు రైళ్లను రద్దు చేసిన సంగతి తెల్సిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్‌ డివిజన్లకు రోజువారీగా 125 సాధారణ రైళ్లు, 128 ఎంఎఎంటీస్‌ సర్వీసులకు బ్రేకులు పడనున్నాయి.