ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్  - Telugu News - Mic tv
mictv telugu

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ 

May 11, 2020

Railways Passenger Services to Restart

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా సడలింపులు ఇస్తోంది. ఇప్పటికే కొన్ని వినహాయింపులు ఇవ్వగా తాజాగా రైలు సర్వీసులను పున:ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల 12 నుంచి రైళ్లు నడపాలని నిర్ణయించింది. నిర్ధేశించిన మార్గాల్లో కొన్ని షరతులకు లోబడి వీటిని నడిపించనున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. 30 రైళ్లను వివిధ ప్రాంతాలకు వెళ్లనున్నాయి.  ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని సూచించారు. 

ప్రయాణికుల కోసం నేడు సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా టికెట్ బుక్ చేసుకొన్న వారు మాత్రమే ప్రయాణించాలని సూచించారు.ఈ రైలు సర్వీసులు ఢిల్లీ నుంచి పలు ప్రధాన నగరాలకు వెళ్లనున్నాయి. ఇవి ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై సెంట్రల్, తిరువనంతపురం, అహ్మదాబాద్, జమ్మూతావి, అగర్తలా, హౌరా, పాట్నా, దిబ్రూగఢ్, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్ నగరాలకు సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ప్రయాణ టికెట్ ఉన్నవారిని మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతించనున్నారు. దీంతో పాటు కరోనా పరీక్షలు నిర్వహించి వ్యాధి లక్షణాలు లేనివారికే ప్రయాణం చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.