తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

August 31, 2019

Rain ..

తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి.లోతట్టు ప్రాంతాల్లో పలు ఇళ్లలోకి నీరు చేరింది. హైదరాబాద్‌లో రాత్రి కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో నీరు చేరింది. మరోవైపు సెప్టెంబర్ 2న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జలాశయాలు నిండుకున్నాయి. మరోసారి వాన కురుస్తుందనే వార్తలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.