సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు - MicTv.in - Telugu News
mictv telugu

సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు

August 14, 2020

Rain in Telugu States

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నారు. రానున్న మూడు రోజుల్లోనూ ఇంకా ఎక్కువ స్థాయిలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంకు తోడు అల్పపీడనం కూడా తోడవడంతో సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ల వద్దని హెచ్చరించారు.

బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కూడా అయ్యాయి. ఆయా జిల్లాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలు ఉండటంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు.