తెలంగాణాకు వర్ష సూచన - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణాకు వర్ష సూచన

April 15, 2019

మే మాసం కూడా రాలేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఓ చల్లని కబురు అందించింది.

రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Rain prediction for Telangana state within the two days.

కర్ణాటక నుంచి శ్రీలంక సమీపంలోని కొమరీన్‌ ప్రాంతం వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. వర్షాలు లేని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 డిగ్రీలు అదనంగా పెరిగే సూచనలున్నాయి. ఈ నెల 17 నుంచి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే సూచనలున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.