హైదరాబాద్ నగరానికి వర్ష సూచన! - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ నగరానికి వర్ష సూచన!

May 24, 2020

rain

గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రమంతటా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో నగరప్రజలు భానుడి ప్రతాపానికి విలవిలలాడుతున్నారు. దీనికితోడు వడగాలుల తీవ్రతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు గరిష్ఠంగా 42.8, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 14 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఈ కారణంగా 25, 26న హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.