rain stop ind vs ban match
mictv telugu

ఇండియా-బంగ్లా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..

November 2, 2022

rain stop ind vs ban match

టి20 ప్రపంచ కప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి బంగ్లాదేశ్ ధాటిగా ఆడుతున్న సమయంలో వర్షం పడింది. వర్షం పడే సమయానికి బంగ్లాదేశ్ ఏడు ఓవర్లలో 66 పరుగులు చేసింది. ఎల్.దాస్ 59 పరుగులు, షాంటో 7 పరుగులతో క్రీజ్‌‌లో ఉన్నారు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే డక్ వర్త్ లూయిస్ పద్ధతిని ఆశ్రయిస్తారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇప్పటికే 17 పరుగుల ఆధిక్యంలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించినట్టు ప్రకటిస్తారు.

అంతకుముందు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలకు సూర్యకుమార్ యాదవ్ దూకుడు తోడవడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది టీంఇండియా. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్.. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (2) వికెట్ కోల్పోయింది.గత మూడు మ్యాచ్‌‌ల్లో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో రాణించాడు. 32 బంతుల్లో 50 పరుగులు చేసిన రాహుల్.. కోహ్లితో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. హాఫ్ సెంచరీ చేశాక మరుసటి బంతికే రాహుల్ ఔటయ్యాడు. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సూర్య వేగంగా ఆడగా.. కోహ్లి నిలకడగా పరుగులు రాబట్టాడు.37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్.. 44 బంతుల్లో 64 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. ఆఖర్లో దూకుడుగా ఆడిన అశ్విన్ 6 బంతుల్లో 13 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.