ఎర్రపు రంగులో కురిసిన వర్షం..ఎక్కడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రపు రంగులో కురిసిన వర్షం..ఎక్కడంటే..

September 26, 2019

గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యూములో నింబస్ మేఘాల కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా సెప్టెంబర్ మాసంలో వర్షం పడుతోంది. తాజాగా పడుతున్న వర్షంలో తమిళనాడులో మాత్రం ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వర్షపు నీరు ఎరుపు రంగులో ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నీలగిరి జిల్లా కడలూరు సమీప గ్రామాల్లో వాననీరు ఎరుపు రంగులో కనిపించింది. 

Rain Water in Red.

నాడుకాని, ముండా, కూవత్తిపొళిల్‌ గ్రామాల్లో సోమవారం రాత్రి గంటకు పైగా వర్షం కురిసింది. ఈ సమయంలో వర్షపు నీరు ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంది. దీన్ని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ నీటిని వాటర్ బాటిళ్లలో సేకరించి వాతావరణశాఖ అధికారులకు అప్పగించారు. వర్షంలో తడిసిన వారికి ఒంటిపై దురద వచ్చిందని చెబుతున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం వల్లే ఇలాంటి విపరీతాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వర్షానికి కారణాలను తెలుసుకునేందుకు పరీక్షల కోసం అధికారులు నీటిని నిపుణులకు అందజేశారు.