వెదర్ రిపోర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం - MicTv.in - Telugu News
mictv telugu

వెదర్ రిపోర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం

July 6, 2020

nhn vm

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. అనుకున్న సమయాని కంటే ముందుగానే ఈసారి తొలకరి పలకరించింది. దీంతో జూన్ నెల నుంచే వర్షాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కూడా నమోదైంది. మరోసారి వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

అల్పపీడనం కారణంగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేసుకునేందుకు ఇవి అనువుగా మారాయి.