వైజాగ్‌పై వరుణుడి కోపం - MicTv.in - Telugu News
mictv telugu

వైజాగ్‌పై వరుణుడి కోపం

October 19, 2017

అందరూ సంబరంగా దీపావళి పండగ చేసుకుంటూంటే వరుణుడికి మాత్రం కన్ను కుట్టినట్టు ఉంది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వేసిన అంచనా నిజమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్టణం నగరంలో పొద్దున్నుంచీ జల్లలు పడుతున్నాయి. దీంతో పండగ కళ తప్పింది. సాయంత్రానికైనా వరుణుడు కరుణించకపోడా అని ఆబాలగోపాలం ఆశగా ఎదురు చూస్తోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తీరంలో గంటకు 45 కి.మీ  నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఆంధ్రలో భారీ వర్షాలు, తెలంగాణ, రాయలసీమల్లోనే తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ బుధవారం  చెప్పింది. జాలర్లు సముద్రంలోకి వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.