తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వాయు గుండం.. భారీ వర్ష సూచన - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వాయు గుండం.. భారీ వర్ష సూచన

October 13, 2020

nvnv

గడిచిన మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీని కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. హైదరాబాద్ లో అయితే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో విసగాయాన్ని వెల్లడించింది. మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడబోతుందని స్పష్టం చేసింది. దీంతో మరో మూడు నాలుగు రోజుల పాటు కుంభవృష్టి కురుస్తాయని అధికారులు తెలిపారు. 

విశాఖపట్టణం, నర్సాపూర్ మధ్య కాకినాడకు దగ్గరలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖ తీరానికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం తీరం దాటే సమయంలో ఈదురుగాలులు విస్తాయని చెప్పారు. దీని కారణంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం తర్వాత  అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు మూడు రోజులుగా పడుతున్న వర్షాలతో హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.