వెదర్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన  - MicTv.in - Telugu News
mictv telugu

వెదర్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన 

December 2, 2019

తెలుగు రాష్ట్రాల్లో రైతులకు పంటలు చేతికందే వేల పిడుగులాంటి వార్త వినిపించింది. రాగాల 24 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రెండు, మూడు రోజుల పాటు వాతావరణం తడిగా ఉండనుందని వెల్లడించారు. బంగాళాఖాతం ఆగ్రేయ ప్రాంతం నుంచి వీస్తున్న తేమ గాలల కారణంగా వర్షం పడుతున్నట్టుగా చెప్పారు. 

Rains Forecast.

ఇప్పటికే తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుందని తెలిపారు. దీంతో ఇప్పటికే వాతావరణం మేఘావృతమైంది ఉంది. తేమ గాలుల కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు సూచించారు. ఈ ప్రభావంతో చలి కూడా ఇప్పటికే తగ్గింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.