Rains Hit Next Three Days Low Pressure In Indian Ocean
mictv telugu

సముద్రంలో మరో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు

December 22, 2022

Rains in AP for three days under the influence of low pressure

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా మారనుందని వెల్లడించింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈశాన్య గాలుల కారణంగా ఏపీలో చలి ప్రభావం పెరుగుతుందని, రాష్ట్రమంతా దట్టమైన పొగమంచు పరుచుకుంటుందని వివరించింది. అటు అల్పపీడన ప్రభావం తమిళనాడుపై గట్టి ప్రభావం చూపనుంది. రాబోయే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

డీహెచ్ శ్రీనివాసరావును రోడ్లపై ఉరికించి కొట్టాలె.. బండి సంజయ్

పెరుగుతున్న కరోనా కేసులు..తెలంగాణ సర్కార్ అలర్ట్