Rains in AP for three days
mictv telugu

ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు

September 23, 2022

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది. శుక్రవారం ఆర్ధిక రాజధాని విశాఖపట్టణంలో సుమారు గంటపాటు వర్షం కురవగా, బలమైన గాలులతో పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు మెరిశాయి. 24 శనివారం రోజున ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని, దిగువ ట్రోపో ఆవరణలో రాష్ట్రం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా పశ్చిమ, వాయవ్య దిశగా బలమైన గాలులు వీస్తున్నాయని స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు మధ్య వ్యాపించి ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం కూడా రాష్ట్రంలో పలు చోట్ల జల్లులు కురుస్తాయని, తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని వివరించారు.