వీడని వాయుగుండం.. మరికొన్ని గంటలు తప్పని వానలు  - MicTv.in - Telugu News
mictv telugu

వీడని వాయుగుండం.. మరికొన్ని గంటలు తప్పని వానలు 

October 14, 2020

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో తెలుగు రాష్ట్రాల్లో అంతులేని నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలతో ఇళ్లలోకి నీరు వచ్చాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లు కూలిపోయాయి. లక్షలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. వరంగల్, హైదరాబాద్ నగరాల్లో నష్టం భారీగా వాటిల్లింది. చెట్లు విరిగిపడ్డాయి. అయితే ఈ ముప్పు ఇప్పుడే అయిపోలేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

అల్పపీడనం గంటగంటకూ బలపడుతూ ఉండటంతో రేపు సాయంత్రం తర్వాత మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.నిన్నటి వాయుగుండం ప్రభావం కూడా ఇంకా వీడకపోవడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రజలు  అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. మరోవైపు హైదరాబాద్‌లో మబ్బు కమ్మేయటంతో చీకటిగా మారిపోయింది. చలి తీవ్రత పెరగడంతో జనం కూడా బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు.