తెలంగాణలో రేపటి నుంచి వానలు: వాతావరణ శాఖ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో రేపటి నుంచి వానలు: వాతావరణ శాఖ

April 4, 2022

fgv

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. మరికొంతమంది ఎండలు తీవ్రంగా కొట్టుతుండడంతో తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వేడి గాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. అధికారులు మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. ఇటువంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.

”రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాం. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశం ఉంది. 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది” అని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.