Home > Featured > నేడు,రేపు తెలంగాణలో వర్షాలు.. రాయలసీమలో కూడా..

నేడు,రేపు తెలంగాణలో వర్షాలు.. రాయలసీమలో కూడా..

Rains In Telangana Next 24 Hours..

వాన కబురు రైతులకు శుభవార్తను అందించింది. వరినాట్లు వేస్తూ పనుల్లో నిమగ్నమైన రైతులపై వరుణుడు కనికరిస్తున్నాడు. కొన్ని రోజులుగా తగ్గుముఖంపట్టిన వానలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. తెలంగాణతో పాటు రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈ ప్రభావం మరో రెండు రోజులపాటు కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈశాన్య మధ్యప్రదేశ్, దక్షిణ ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడిన అల్ప పీడనం ఏర్పడింది. దీంతో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికే తెలంగాణ, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సీమలో వర్షం పడుతుండటంతో అక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 22 Aug 2019 10:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top