Rains in Telangana today and tomorrow: Meteorological Department
mictv telugu

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు: వాతావరణ శాఖ

June 27, 2022

vaa

తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయని, ఈరోజు, రేపు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నట్లు సోమవారం అధికారులు వివరాలను వెల్లడించారు.

”మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. దీంతో ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అత్యధికంగా నిజామాబాద్ (రాజన్న జిల్లా)లో 4, 6, కోహెడ (సిద్దిపేట)లో 4, మల్యాల (కరీంనగర్)లో 4, టేక్మాలు(మెదక్)లో 4, అశ్వాపురం (భద్రాద్రి)లో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం అత్యధికంగా కారేపల్లి (ఖమ్మం)లో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.”