వెదర్ రిపోర్ట్.. మరో 4 రోజులు వర్షాలు - MicTv.in - Telugu News
mictv telugu

వెదర్ రిపోర్ట్.. మరో 4 రోజులు వర్షాలు

July 16, 2020

Rains In Telugu States

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్తను వినిపించింది. మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జార్ఖండ్‌ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో ఉపరితల ద్రోణి వాయువ్య బంగాళాఖాతం మీదుగా పయనిస్తుండటంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బుధ, గురు వారాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 18, 19 తేదీల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లోనూ కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని, మత్య్సకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు.