సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు...జర భద్రం.. - MicTv.in - Telugu News
mictv telugu

సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు…జర భద్రం..

July 15, 2017

17, 18 తేదీల్లో ఏమైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి..లేదంటే ముందే చేసుకోండి..ఎందుకంటే భారీ వర్షం తెలంగాణని ముంచెత్తబోతోంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచ్చే అవకాశం ఉంది..జర భద్రంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలో ఈ నెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.. కోస్తా తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సో సోమ, మంగళవారాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ఛత్రీలు ,రెయిన్ కోట్ లు తీసుకు పోవడం మర్చిపోవద్దు..