రైల్వే బడ్జెట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని రెండు రాష్ట్రాల నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. అయితే దక్షిణ మధ్య రైల్వేకు గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించారని అంటున్నారు జోనల్ జీఎం వినోద్ కుమార్ యాదవ్. రైల్వే బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు జరిపిన కేటాయింపుల వివరాలను ఆయన విలేకర్ల సమావేశంతో తెలిపారు.
2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను నిధులు తెలంగాణకు 5 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 8 శాతం పెరిగాయన్నారు. తెలంగాణకు మొత్తం రూ.1,813 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,670 కోట్లు కేటాయించారన్నారు. అయితే ప్రతిపాదిత ప్రాజెక్టులు, పెండింగులో ఉన్న ప్రాజెక్టుల వ్యయాలతో పోలిస్తే ఈ నిధులు అరకొరే. ఈ లెక్కన కేటాయింపులు జరిపితే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి మరో 50 ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రైల్వే లైన్ల వారీగా కేటాయింపులిలా..
విద్యుదీకరణ
* లింగంపేట- నిజామాబాద్ రూట్లో 95 కి.మీ. మేర విద్యుదీకరణ పనులకు రూ.80.29 కోట్లు
* వికారాబాద్- పర్లి వైజనాథ్ మార్గంలో 269కి.మీ. విద్యుదీకరణకు రూ.262.12 కోట్లు
* గద్వాల- రాయచూర్ మార్గంలో 57కి.మీ. మేర విద్యుదీకరణకు రూ.46.10 కోట్లు
* తెనాలి- రేపల్లె మార్గంలో 34కి.మీ మేర విద్యుదీకరణకు రూ.25.98 కోట్లు
* నంద్యాల-ఎర్రగుంట్ల మార్గంలో 123 కి.మీ. విద్యుదీకరణకు రూ.111.48 కోట్లు
* ధర్మవరం- పాకాల మార్గంలో 228కి.మీ విద్యుదీకరణకు రూ.210.47 కోట్లు
* గుంతకల్లు- కల్లూరు మార్గం విద్యుదీకరణకు రూ.15కోట్లు
* నల్లపాడు-పగిడిపల్లి మార్గం విద్యుదీకరణకు రూ.291.75 కోట్లు
* పెద్దపల్లి-లింగపేట (జగిత్యాల) మార్గం విద్యుదీకరణకు రూ.33.31 కోట్లు
* మన్మాడ్-ముద్ఖేడ్-డోన్ మార్గం విద్యుదీకరణకు రూ.115కోట్లు
* గుంతకల్లు- బళ్లారి మార్గం విద్యుదీకరణకు రూ.50కోట్లు
అనుమతులు..
* భద్రాచలం- సత్తుపల్లి కొత్త రైల్వే లైన్‌కు రూ.120కోట్లు
* కాజీపేట- బలార్ష మూడో రైల్వే లైన్‌కు రూ.301కోట్లు
* పటాన్చెరు- సంగారెడ్డి- జోగిపేట- మెదక్ 95 కి.మీ కొత్త రైల్వే లైన్ సర్వేకు అనుమతి
* నిజామాబాద్- నిర్మల్- ఆదిలాబాద్ 125 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ సర్వేకు అనుమతి
* మానుకొండూర్-హుజురాబాద్-ఎల్కతుర్తి 60 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్‌కు అనుమతి
కొత్త లైన్లకు కేటాయింపులు
* అక్కన్నపేట- మెదక్ కొత్త రైల్వే లైన్‌కు రూ.130కోట్లు
* ఓబులవారిపల్లె – కృష్ణపట్నం కొత్త రైల్వే లైన్‌కు రూ.200 కోట్లు
* మనోహరాబాద్- కొత్తపల్లి కొత్త రైల్వేలైన్‌కు రూ.125కోట్లు
* మునిరాబాద్- మహబూబ్‌నగర్ కొత్త రైల్వే లైన్‌కు రూ.275 కోట్లు
* నడికుడి- శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్‌కు రూ.420కోట్లు
* కడప- బెంగళూరు కొత్త రైల్వే లైన్‌కు రూ.175కోట్లు
* విజయవాడ-గుంటూరు వయా అమరావతి కొత్త రైల్వే లైన్‌కు రూ.10కోట్లు
* కోటిపల్లి -నరసాపురం కొత్త రైల్వేలైన్‌కు రూ.200కోట్లు
డబ్లింగ్ పనులకు..
* గుంటూరు- తెనాలి డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.40కోట్లు
* గుంతకల్లు- కల్లూరు డబ్లింగ్ ప్రాజెక్ట్‌కు రూ.76.52 కోట్లు
* గుంటూరు- గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్ట్‌కు రూ.200కోట్లు
* విజయవాడ- భీమవరం- నిడదవోలు రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.200కోట్లు
* సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ ప్రాజెక్ట్‌కు రూ.250కోట్లు
* గుత్తి- ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్ట్‌కు రూ.76కోట్లు
విస్తరణ, అభివృద్ధి
* ఘట్కేసర్- యాదాద్రి రెండో విడత ఎంఎంటీఎస్ విస్తరణకు రూ.21.25 కోట్లు
* విజయవాడ, కాజీపేట, రేణిగుంట, వాడి, గుత్తిలో బైపాస్ లైన్ల కోసం రూ.30.80కోట్లు
* చర్లపల్లిలో శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధికి రూ.5కోట్లు