పెళ్లికి నేను రెడీ, ఆమే ఆలస్యం చేస్తోంది: రాజ్ తరుణ్ - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికి నేను రెడీ, ఆమే ఆలస్యం చేస్తోంది: రాజ్ తరుణ్

June 14, 2019

Raj Tarun To Marry Vijayawada Girl!

అచ్చ తెలుగు విజయవాడ అమ్మాయినే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు యంగ్ హీరో రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి వివరించాడు. గత ఆరేళ్లుగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాననని, తరచూ కలుస్తుంటామని చెప్పాడు.‘ ఆరేళ్ల కిందట వైజాగ్‌లో నా బర్త్ డేలో తనను చూశాను.. ఇద్దరి అభిప్రాయాలు కలిసి ప్రేమలో పడ్డామని తెలిపాడు. ఆమెకు చిత్ర పరిశ్రమతో ఎటువంటి సంబంధమూ లేదు.. తను విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్త’ అని తెలిపాడు. అయితే అమ్మాయి పేరును బయటకు చెప్పలేదు రాజ్ తరుణ్. కారణం తనకు పబ్లిక్‌గా సొంత విషయాలు షేర్ చేసుకోవడం ఇష్టం వుండదని చెప్పాడు.

మేము తరచూ కలుస్తుంటామని.. ప్రస్తుతం జీవితాంతం ఒకరికొకరం అనే ఫీలింగ్‌లో ఉన్నామన్నాడు. ఇరు కుటుంబాలు తమ పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయని తెలిపాడు. తన అమ్మానాన్నలతో ఆమె ప్రతిరోజూ మాట్లాడుతుందని చెప్పాడు. పెళ్లికి తాను ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా.. తనే ఆలస్యం చేస్తోందని.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడు. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో ముద్దు సీన్ల గురించి ఆమె స్పందన ఎలా వుందని ప్రశ్నించగా.. అదంతా నా వృత్తిలో భాగంగానే భావిస్తుందని.. నేను ఎప్పుడూ మోసం చేయనన్న నమ్మకం తనకుంది అని అన్నాడు.