ఏం జరుగుద్దో నాకైతే తెలియదు.. తర్వాత మీ ఇష్టం - MicTv.in - Telugu News
mictv telugu

ఏం జరుగుద్దో నాకైతే తెలియదు.. తర్వాత మీ ఇష్టం

May 2, 2022

మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న ప్రధాన డిమాండ్‌తో వార్తల్లోకెక్కిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 3 వరకు లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే మహారాష్ట్ర సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. మే 4 నుంచి తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో అంతకు రెట్టింపు సౌండుతో వినిపిస్తారని ప్రకటించారు. ఔరంగాబాద్‌ పర్యటన సందర్భంగా థాకరే ఈ అంశంపై మాట్లాడారు. ‘మే 3 వరకు లౌడ్ స్పీకర్లు తీసేయాలని పోలీసులకు సూచిస్తున్నా. ముస్లింలు అర్దం చేసుకోకపోతే వారికి మా రాష్ట్ర శక్తి ఏంటో చూపిస్తాం. మీ ఆజాన్ మేం వింటుంటే మా హనుమాన్ చాలీసాను మీరు కూడా వినాలి. ఇటీవల ఓ ముస్లిం జర్నలిస్టు సైతం లౌడ్ స్పీకర్ల వల్ల తానూ తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాడు. చిన్న పిల్లలకు నిద్రా భంగం కలుగుతోందని వాపోయాడు’ అంటూ వ్యాఖ్యానించారు..