’అర్జున్ రెడ్డి’ పై ఇక రాజమౌళి వంతు..! - MicTv.in - Telugu News
mictv telugu

’అర్జున్ రెడ్డి’ పై ఇక రాజమౌళి వంతు..!

August 29, 2017

’అర్జున్ రెడ్డి’  సిన్మ  హిట్టు బొమ్మగా టాకీసులల్ల దుమ్ము లేపుతుంది.ఇప్పటికే  చాలామంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. రాంగోపాల్ వర్మ అయితే  ఫేస్ బుక్  ఓపెన్ జేస్తె చాలు అర్జున్ రెడ్డి గురించి తప్ప ఇంకేం  రాస్తలేడు.ఇగ నలుగురు ఒక్కతాడ కలిస్తే దాదాపు ఈ సిన్మ ముచ్చట్లే నడుస్తున్నయ్. అగో అంత అడిక్డ్ అయితున్రు అర్జున్ రెడ్డి సిన్మకు.

తాజాగా అర్జున్ రెడ్డి సిన్మ మీద  బాహుబలి డైరెక్టర్ జక్కన్న  గుడ ట్విట్టర్ల  స్పందించిండు.ఇప్పుడే అర్జున్ రెడ్డి సిన్మ జూశ్న.ప్రేమకథలు సూపిచ్చుట్ల నేను జరంత ఎన్కనే ఉన్న.’అర్జున్ రెడ్డి’  సిన్మల విజయ్‌ దేవరకొండ అదరగొట్టేశాడు. అర్జున్‌ పాత్రలో జీవించేశాడు.

అతనే కాదు నటి షాలిని, మిగతా నటీనటులు కూడా చాలా బాగా నటించారు. డైలాగులు కూడా మస్తు రాశిన్రు. క్రెడిట్‌ అంతా దర్శకుడు సందీప్‌ వంగదే. సిన్మను మస్తు హ్యాండిల్‌ చేశిండు. సినిమా ఇంతటి  విజయం సాధించినందుకు  చిత్ర యూనిట్ కు  అభినందనలు’ అని ట్వీట్టర్ల  రాశిండు జక్కన్న.