అభిమాని రచ్చ.. నటిని పెళ్లాడతానని ఇంటికెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

అభిమాని రచ్చ.. నటిని పెళ్లాడతానని ఇంటికెళ్లి

May 10, 2019

అభిమానం హద్దులు దాటితే అరాచకంగా మారుతుంది అనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. నటీనటులను అభిమానించాలి గానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అంటే కుదురుతుందా? ఓ టీవీ సీరియల్లో ఫేమస్ అయిన నటిని వన్‌సైడ్ లవ్ చేశాడో ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు. ఆ విషయాన్ని ఆమె ఇంటికి వెళ్ళి డైరెక్టుగా చెప్పాడు. అది కూల్‌గా చెబితే బాగుండేది కానీ, అతను ఆమె తండ్రని పట్టుకుని బెదిరించాడు. రితికాను తనకిచ్చి పెళ్లి చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరిమధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పోలీసులు వచ్చి అతణ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ‘రాజు రాణి’ సీరియల్ ఫేం రితిక ఈమధ్య అక్కడ బాగా ఫేమస్ అయింది. ఆమె పలు సీరియళ్లతో పాటు సినిమాలు కూడా చేస్తోంది.

 

పైగా ఆమె టిక్‌టాక్‌లో కూడా చాలా ఫేమస్ అయింది. ఆమె ప్రస్తుతం చెన్నైలోని వడపళని వందడుగుల రహదారి సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో తండ్రితో పాటు ఉంటోంది. అయితే గురువారం ఉదయం ఓ యువకుడు అపార్టమెంట్‌లోని రితిక ఇంటి తలుపులు తట్టాడు. ఆమె తండ్రి సుబ్రహ్మణి తలుపులు తెరిచాడు. వెంటనే ఆ యువకుడు పెళ్లి కుబురు మాట్లాడటానికి వచ్చినట్టు రితికాను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రిని కోరాడు. దీంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకోగా, ఆ యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో చుట్టుపక్కల వున్న ఫ్లాట్స్ వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.

Raja Rani actress Rithika's father approached with a marriage proposal for her - here's what happened next.

పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అతడి పేరు భరత్ అని, అతను గోబిచెట్టిపాళ్యానికి చెందినవాడని గుర్తించారు. ఇంజినీరింగ్ చదివిన భరత్ ఉద్యోగం కోసం చెన్నై వచ్చాడని, గురువారం సొంతూరికి వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకుని రితికా ఇంటికి వచ్చి గొడవ చేశాడని పోలీసులు తెలిపారు. తనకు రితిక అంటే చాలా ఇష్టమని, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.