రవివర్మకు అందిన తిలోత్తమకు రూ. 5 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

రవివర్మకు అందిన తిలోత్తమకు రూ. 5 కోట్లు

March 23, 2018

రవివర్మకే అందనీ అందానివో.. ’ అని ఓ సినిమాలో కథనాయకుడు తన ప్రేయసి అందచందాలను పరవశంగా పొగుడుతాడు. ఆ సంగతేమోగాని రవివర్మ చాలామంది అందగత్తెలను చిత్రాల్లో బంధించాడు. అందులో సురలోకభామ తిలోత్తమ చిత్రం ఒకటి. ఈ పెయింటింగు సోత్ బే సంస్థ ఇటీవల న్యూయార్క్ లో వేలం వేయగా గుర్తుతెలియని వ్యక్తి రూ. 5.17 కోట్లుకు కొనుక్కున్నాడు.

ఆధునిక, సమకాలిన దక్షిణాసియా కళాఖండాల విభాగంలో ఈ బొమ్మను అమ్మకానికిపెట్టారు. కాగా కొన్నాళ్ల కిందట జరిగిన వేలంలో రవివర్మ వేసిన ‘వెన్నోల్లో రాధిక’ చిత్రానికి రూ. 23 కోట్ల భారీ ధర పలికింది. రవివర్మ పెయింటింగుల్లో అత్యధిక ధరకు అమ్ముడుబోయింది ఈ చిత్రమే. రవివర్మ చిత్రాలు వేలానికి రావడం అరుదైన విషయం. అతడు వేసిన పెయింటింగులు రాజవంశల వద్ద, మ్యూజియాల్లో ఉన్నాయి.