ఇండియా- పాక్ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రాజాసింగ్ పోస్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియా- పాక్ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా రాజాసింగ్ పోస్టర్

October 24, 2022

 

Raja Singh Fan shows His Poster in India vs Pakistan match

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరిగిన భారత్- పాక్ టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి 82 పరుగులతో భారత్‌ గెలుపుతో కీలక పాత్ర పోషించాడు. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌ను సగటు క్రికెట్ ప్రేక్షకుడు టీవీలు, మొబైల్ ఫోన్లలో ఎంతో ఆసక్తిగా వీక్షించాడు. అయితే.. ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ కావటంతో.. స్టేడియం కూడా అంతే స్థాయిలో ఫుల్ అయిపోయింది. ఈ క్రమంలోనే.. స్టేడియంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఇండియా అభిమానులంతా.. జాతీయ జెండాలనో.. లేదంటే తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలనో ప్రదర్శిస్తుంటే.. ఓ వ్యక్తి మాత్రం రాజాసింగ్‌ ఫొటోను ప్రదర్శించాడు. దీంతో.. ఎంతో ఉత్కంఠగా సాగిన ఇండియా- పాక్ మ్యాచ్‌లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్‌తో పాటు రాజాసింగ్ ఫొటోలు కూడా స్పెషల్ అట్రక్షన్‌గా నిలిచాయి.

మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రౌడ్‌లో.. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఎన్నారై ఒకరు.. రాజాసింగ్‌కు మద్దతుగా మ్యాచ్ జరుగుతుండగా ఆయన ఫొటో ప్రదర్శించాడు. ఎటువంటి నినాదాలు లేకుండా కేవలం రాజాసింగ్ కాషాయ దుస్తుల్లో ఉన్న ఫొటో తో పాటుగా ఛత్రపతి శివాజీ ఉన్న పోస్టర్ ను మాత్రం చేత పట్టి లక్ష మంది క్రికెట్ అభిమానుల మధ్య ప్రదర్శించటం.. వైరల్ కావటం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్‌కు మద్దతు తెలపటమే కాదు.. ఆయనను విడుదల చేయాలని కోరుకుంటూ ఆ అభిమాని రాజాసింగ్ ఫొటో చూపించినట్టు తెలుస్తోంది.