రాజాసింగ్ కొండను ఢీ కొంటున్నాడా..? - MicTv.in - Telugu News
mictv telugu

రాజాసింగ్ కొండను ఢీ కొంటున్నాడా..?

July 28, 2017

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్..కేసీఆర్ ని ఢీ కొంటున్నాడా?ఏమో మరి ఆయన ట్విట్టర్ లో రాసిన వాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తుంది.నాలుగేళ్ల కిందట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2013 సెప్టెంబరు 29న హైదరాబాద్‌లోని షాయినాయత్‌గంజ్‌లో జరిగిన ‘విశాల గోరక్ష గర్జన సనాతన ధర్మ సభ’లో పాల్గొన్న రాజాసింగ్, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు ఆయనపై కేసు నమోదైంది. దీనికితోడు ఆయనపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లోవున్న నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు, న్యాయశాఖకు లేఖ రాసిన విషయం తెల్సిందే! ఆ లేఖపై స్పందించిన న్యాయశాఖ చివరకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

రాజాసింగ్ ట్విట్టర్లో ఏమి రాసారంటే,,

తెలంగాణ సియం కేసిఆర్..నాకు వ్యతిరేకంగా కేసును రిజిస్టర్ చేయించారు,నేను పవర్ కోసం పాలిటిక్స్ లోకి రాలేదు,ధర్మాన్ని రక్షించడానికి,గో రక్షన కోసం,భారత మాత కోసం అవుసరమైతే నా ప్రాణాలను కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని రాజాసింగ్ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు.