Rajagopal good bye to Congress..submission of resignation letter
mictv telugu

ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రాజీనామా..ఆమోదించిన స్పీకర్

August 8, 2022

 

తెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే రాజీనామా లేఖను సోమవారం ఉదయం స్పీకర్‌కు సమర్పించారు. స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చిన తన రాజీనామాను పోచారం ఆమోదించినట్టు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన గుడ్ బై చెప్పారు. అనంతరం అసెంబ్లీ రోడ్డులోని గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

తన రాజీనామా లేఖపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..”తెలంగాణలో అరాచక పాలన సాగుతోంది. తెలంగాణ సమాజం ఆకలినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదు. కేసీఆర్‌ చేతిలో ఆత్మగౌరవం బంధీ అయ్యింది. మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసం నా పదవిని త్యాగం చేస్తున్నా. కుటంబ పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నా. నా స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోను. రాజీనామా అనంతరమే మునుగోడు ఉప ఎన్నికపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రాజీనామా అనగానే కొత్తగా గట్టుప్పల్ మండలం వచ్చింది” అని ఆయన అన్నారు.