ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో వేడి పుట్టిస్తుంది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం అంశంలో బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి, కవిత మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలతో పాటు పలువురి పేర్లను ప్రస్తావించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును మరోసారి ఈడీ ప్రస్తావించడంపై వార్తపత్రికల్లో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన.. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆమెపై విమర్శలు చేశారు. కవితను లిక్కర్ క్వీన్ అని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ‘‘చార్జిషీట్లో లిక్కర్ క్వీన్స్ పేరు 28 సార్లు ప్రస్తావించబడింది’’ అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు.
రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌కు కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడకు.. మాట జారకు !! ” 28 సార్లు ” నా పేరు చెప్పించినా, ” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు..అంటూ కవిత ట్వీట్ చేశారు.
రాజగోపాల్ అన్న ..
తొందరపడకు , మాట జారకు !!
" 28 సార్లు " నా పేరు చెప్పించినా
" 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా
అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail https://t.co/476lW6fOTC— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022
అయితే కవిత ట్వీట్‌కు రాజగోపాల్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. “నిజం నిప్పులాంటి చెల్లెమ్మా..నువ్వు లిక్కర్ స్కామ్‌లో ఉన్నది నిజం. మునుగోడు ఉప ఎన్నికలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శకంగా టెండర్ ద్వారా వచ్చిన రూ.18వేల కోట్ల విషయంలో నాపై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. రాబోయే రోజుల్లో అవినీతిమయమైన కల్వకుంట్ల కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం” అంటూ రాజగోపాల్ బదులిచ్చారు. దీనిపై కవిత మరోసారి స్పందిస్తారో లేదో వేచి చూడాలి..
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక @KTRTRS(#TwitterTillu) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల 1/2 https://t.co/xKfidkDslc
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022
కోల్ బ్లాక్ టెండర్ విషయం లో నా పై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలు కి వెళ్లడం ఖాయం 2/2.
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022