Rajagopal Reddy challenge to Minister Jagadish Reddy
mictv telugu

రాజకీయ సన్యాసం తీసుకుంటా.. రాజగోపాల్ రెడ్డి

August 15, 2022

తెలంగాణ రాక ముందు ఇల్లే లేని జగదీశ్ రెడ్డికి ఇప్పుడు వేయి కోట్ల ఆస్తి ఎక్కడిదని ప్రశ్నించారు బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి. . తాను కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరాడని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. త్వరలోనే మంత్రి అవినీతి చిట్టా బయటపెడతానని చౌటుప్పల్ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. మంత్రి అవినీతి, అక్రమాలు, బినామీ ఆస్తులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని తెలిపారు. తాను నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకపోతే మంత్రి రాజీనామా చేస్తాడా అని సవాల్ విసిరారు. తాను రాజీనామా చేసిన తరువాతే చౌటుప్పల్-సంస్థాన్ నారాయణపురం రహదారిని ఆగమేఘాల మీద వేస్తున్నారని తెలిపారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతోనే రాష్ట్ర ప్రజల తలరాతలు మారుతాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు.