rajagopal reddy responed on munugodu result
mictv telugu

టీఆర్ఎస్‌ది అధర్మ విజయం :రాజగోపాల్ రెడ్డి

November 6, 2022

మునుగోడు ఉపఎన్నిక ఫలితాలపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు.” ఎన్నికల్లో నైతికంగా నేను గెలిచా. టీఆర్ఎస్ మందు, డబ్బు, పంచి అధర్మంగా గెలిచింది. నన్ను మా నేతలను పోలీసులతో కట్టడి చేసారు. 31వ తేదీ వరకు ధర్మయుద్దం నడిచింది. నవంబర్ 1 నుంచి పోలీసులు, టీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడ్డారు. రిటర్నింగ్ అధికారి కనీస నిబంధనలు పాటించలేదు. ఈ ఎన్నికల్లో అధర్మం గెలిచింది. గుర్తుల కేటాయింపు నుంచే అధికార దుర్వినియోగం చేసారు.

ఒక్క ఎమ్మెల్యేను ఓడించేందుకు కౌరవ సైన్యం వచ్చింది. కనీసం నన్ను ప్రచారం కూడా చేసుకోనివ్వలేదు.కేసీఆర్, కేటీఆర్ అధికారులపై ఒత్తిడి పెట్టారు. కేసీఆర్‌కు కమ్యూనిస్టు నాయకులు అమ్ముడుపోయారు. నా పదవిని మునుగోడు ప్రజల కోసం త్యాగం చేశాను. ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతుంది. నా కోసం మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.