Rajagopal Reddy sold the land to visakha industries for 60 crore rupees
mictv telugu

మాజీ ఎంపీ వివేక్‌కి భూమి అమ్మి రూ. 60 కోట్లు తీసుకున్న రాజగోపాల్ రెడ్డి.. సాక్ష్యం ఇదిగో

October 19, 2022

మునుగోడు ఉప ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్ధిగా నిలబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన నామినేషన్ పత్రాల్లో ఆసక్తికర అంశాన్ని పేర్కొన్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు వివేక్ వెంకట స్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కి భూమి అమ్మినట్టు అందులో తెలియజేశారు. ఇందుకోసం రూ. 59 కోట్ల 95 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నట్టు అఫిడవిట్ ఇచ్చారు. దీంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వేల కోట్ల అస్తులున్నాయనుకుంటున్న రాజగోపాల్ రెడ్డికి భూమి అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని గుసగుసలాడుకుంటున్నారు. అడ్డాన్సే ఇంత ఉంటే అసలు విలువ ఎంతుంటుందో అని సాధారణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమేనా లేక ఎన్నికల ఖర్చుల కోసం ఏమైనా జిమ్మిక్కులు చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటు వివేక్‌కి కూడా బాగా ఆస్తిపాస్తులు ఉన్నట్టు సమాచారం. అటు మునుగోడులో ప్రచారం రోజురోజుకీ జోరందుకుంటోంది. ప్రజలు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Rajagopal Reddy sold the land to visakha industries for 60 crore rupees