Rajagopal reddy son sankeerth reddy sushee infra tax raids
mictv telugu

రాజగోపాల్ రెడ్డి కొడుకు కంపెనీలో సోదాలు

November 14, 2022

Rajagopal reddy son sankeerth reddy sushee infra tax raids

మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇప్పట్లో ‘కష్టాలు’ తీరేలా కనిపించడం లేదు. ఆయన కొడుకు సంకీర్త్ రెడ్డికి చెందిన ప్రముఖ కంపెనీలో జీఎస్టీ పన్ను అధికారులు సోదాలు చేశారు. సంకీర్త్ ఎండీగా వ్యవహరిస్తున్న బంజారాహిల్స్‌లోని సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లో సోమవారం ఉదయం నుంచి విస్తృతంగా సోదాలు సాగుతున్నాయి. పన్ను ఎగవేత, ఇతర ఆరోపణలపై కంపెనీ కార్యాలయంతోపాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు చేపట్టినట్టు అధికారులు చెర్పారు.

150 మంది అధికారులు 25 బృందాలుగా ఏర్పడి డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు సేకరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలొ సుశీ కంపెనీ భారీ ఎత్తున లావాదేవీలు జరిపిందని, దీని వెనక ఏదో మతలబు ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఎన్నికల్లో దొరికిన డబ్బు సుశీ కంపెనీ తరఫు నుంచి వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు తమకు దొరకలేదని ఈసీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన సంగతి తెలిసిందే.