పవన్ కల్యాణ్‌కు భారీ షాక్.. కవాతుకు నో - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్‌కు భారీ షాక్.. కవాతుకు నో

October 15, 2018

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 2 లక్షల మందితో తలపెట్టిన  రాజమహేంద్రవరం కవాతుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్చింగ్‌కు అనుమతి లేదని  పోలీసులు తేల్చిచెప్పారు. పవన్ యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై ఈ కవాతు, భారీ సభ నిర్వహించాలనుకున్నారు.. 

vRajamahendravaram police denied permission to Janasena pawan Kalyan’s march Kavatu due to weakness of Dhavaleshwaram project

దీనికోసం భారీ ఏర్పాట్లు చేశారు. జనసే కార్యకర్తలు నగరంలోకి చేరుకుని సందడి చేస్తున్నారు. అయితే బ్యారేజీ కవాతుకు అనుకూలంగా లేదని పోలీసులు పవన్కు నోటీసులు జారీచేశారు. బ్యారేజీ పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయని, 10వేల మంది కంటే ఎక్కువ మందికి సభా ప్రాంగణం సరిపోదని, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపారు.

మధ్యాహ్నం 3 గంటలకు పిచ్చుకల్లంక వద్ద జనసేన కవాతు ప్రారంభం కావాల్సి ఉంది. తర్వాత బ్యారేజీ దిగువన ఉన్న కాటన్ విగ్రహం వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారని పార్టీ తెలిపింది. కాగా, ఒకపక్క తిత్లీ బాధితులు అన్నమో రామచంద్రా అని అల్లాడుతోంతో పవన్ బలప్రదర్శకు దిగడం సరికాదని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.