పైరసీ కేసు ఎంతవరకు వచ్చింది... - MicTv.in - Telugu News
mictv telugu

పైరసీ కేసు ఎంతవరకు వచ్చింది…

May 20, 2017

మూవీ వండర్ బహుబలి డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ హైదరాబాద్ లోని సీసీఎస్, సైబర్‌క్రైమ్ కార్యాలయానికి వెళ్లారు. సైబర్‌క్రైమ్ పోలీసులు బాహుబలి-2 చిత్ర పైరసీ నిందితులను ఇటీవల పట్టుకున్నారు. కేసు వివరాలు, పురోగతిని ఏసీపీ రఘువీర్‌ను అడిగి తెలుసుకున్నారు. బాహుబలి-2 పైరసీ కేసులో సీసీఎస్ పోలీసులు పాట్నాకు చెందిన ఆరుగురుని అరెస్ట్ చేశారు. నిందితులు ప్రధాన సర్వర్‌ను హ్యాక్ చేసి బాహుబలి-2 చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రూ.2 కోట్లు ఇవ్వకపోతే సినిమాను ఆన్‌లైన్‌లో పెడతామని నిర్మాతల్ని నిందితులు బెదిరించారు.