టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మార్చి 25న రిలీజ్ కానుండడంతో ఇప్పటికే దేశమంతా చుట్టేశారు. దీని తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనుండడం తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ప్రస్తావిస్తే ఏదో ఒక రకంగా దాటవేసేవారు. కానీ, ఈ సారి మళ్లీ మళ్లీ అదే ప్రశ్న ఎదురవుతుండడంతో తొలిసారి మహేష్ సినిమా గురించి నోరు విప్పారు. మహేశ్తో చేయబోయే సినిమా లైన్ చాలా ఆసక్తిగా ఉందనీ, సింగిల్ హీరో చేసే సినిమా అని స్పష్టం చేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్లను మించి ఈ సినిమా ఉంటుందని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత మహేశ్తో చేయబోయే సినిమా మీద పూర్తి దృష్టి పెడతానని వ్యాఖ్యానించారు.