Rajamouli is the cause of Tollywood's crisis, RGV Sensational comments
mictv telugu

టాలీవుడ్ సంక్షోభానికి కారణం రాజమౌళే.. ఆర్జీవీ

August 3, 2022

అధిక బడ్జెట్ భరించలేక తెలుగు సినీ నిర్మాతలు షూటింగ్స్‌ను బంద్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు బంద్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం శరవేగంగా రూపుదిద్దుకుంటున్న చిత్రాల పరుగులకు బ్రేకులు పడినట్లయింది. ప్రస్తుతం ఈ విషయం మీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎస్‌ఎస్‌ రాజమౌళినే అని చెప్పారు.

షూటింగ్‌లు బంద్ విషయంపై ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ.. ‘టాలీవుడ్ ప్రస్తుతం పరిస్థితికి మూల కారణం ఒకే ఒక్క వ్యక్తి అని, అతని పేరు రాజమౌళి అని చెప్పడంతో ఆ న్యూస్ యాంకర్ కూడా ఒకింత షాకయ్యారు. రాజమౌళి చేసిన రెండు పనులతో పరిస్థితి ఇలా అయ్యిందన్నారు. వాటిలో ఒకటి.. సినిమా బాగా తీస్తే వేల కోట్లు వస్తాయని ప్రూవ్ చేయడం. రెండు.. సినిమా క్వాలిటీ, కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేయడం. వాటి ముందు మిగిలిన సినిమాలు నిలవలేకపోతున్నాయని అన్నారు. రాజమౌళిని చూసి.. టాలీవుడ్‌లోని మిగిలిన టాప్ డైరెక్టర్స్ అందరూ ఆయన కంటే పెద్ద సినిమా తీయాలని అనుకుంటున్నారని, అందుకే సినిమాల బడ్జెట్ పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేస్తూ.. థియేటర్ల ప్రాబ్లెమ్, ఓటీటీలు కాదు. అసలు శత్రువులు ఎస్ఎస్ రాజమౌళి, యూట్యూబ్’ అని పేర్కొన్నాడు.