ఇండియాలో నెం 1 నటుడు అతనే : రాజమౌళి - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియాలో నెం 1 నటుడు అతనే : రాజమౌళి

April 13, 2022

 

raja

బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో తన ద‌ష్టిలో గొప్ప నటుడెవరో చెప్పేశారు. తాను ఇటీవల తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ దేశంలోనే నెం 1 నటుడని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘కొమురం భీముడో’ పాటలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలు ఆయనలో ఉన్న గొప్ప నటుడికి నిదర్శనమని ప్రశంసించారు. ఒకవైపు బాధ, మరోవైపు ఆగ్రహం, ఇంకోవైపు పౌరుషం కలగలిపి ఆ పాటకు మరింత వన్నె తెచ్చారని అభినందించారు. ఇండియాలో మరే నటుడు కూడా ఇలా నటించలేడని కితాబిచ్చారు. సినిమాలో ఈ పాట చాలా కీలకంగా ఉందని, ప్రేక్షకులు కూడా ఈ పాట వల్ల మరోసారి సినిమాకు వచ్చారని స్పష్టం చేశారు. కాగా, ఈ పాటలో ఎన్టీఆర్ నటనకు జాతీయ అవార్డు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఆర్ఆర్ఆర్ సినిమా రూ. 1000 కోట్ల వసూళ్లను దాటింది.