కిలికీ భాష నేర్చుకోండి...త్వరలో అందుబాటులోకి వెబ్‌సైట్ - MicTv.in - Telugu News
mictv telugu

కిలికీ భాష నేర్చుకోండి…త్వరలో అందుబాటులోకి వెబ్‌సైట్

February 20, 2020

Rajamouli ro launch Kiliki language website

కిలకీ భాష గుర్తుందా? బాహుబలి: ది బిగినింగ్ సినిమాలో ఈ భాష ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసందే. దర్శకుడు రాజమౌళి తన విలన్ కోసం తమిళ గేయ రచయిత మదన్ కార్కీతో కలిసి ప్రత్యేక భాషను సృష్టించారు. మహిష్మతి రాజ్యం మీద దండయాత్ర చేసిన కాలకేయులు కిలికీ భాషలో మాట్లాడారు. 

ఆ తరువాత ఈ భాషకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. కొందరు నెటిజనులు దీన్ని ట్రెండ్‌గా భావించారు. దాని మీద చాలా మంది స్పూఫులు కూడా చేసుకున్నారు. సింగర్ స్మిత అయితే.. ఏకంగా ఆ భాషలో మహా కిలికి అనే పాటను కూడా పాడారు. అయితే ఈ భాష సృష్టికర్త మదన్ కార్కీ కిలికీని ప్రత్యేకమైన భాషగానే రూపకల్పన చేశారు. అంతేకాదు ఈ భాషలో ఏకంగా ఒక వెబ్‌సైట్‌నే రూపొందించారు. త్వరలో దర్శకుడు రాజమౌళి ఈ వెబ్‌సైట్‌ను ట్విట్టర్ ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా రండి.. కిలికి భాష నేర్చుకోండి.. ప్రపంచంలోనే అత్యంత సులువుగా నేర్చుకోదగ్గ భాష ఇది అంటూ మదన్ కార్కీ ట్వీట్ చేశారు.