'ఆర్ఆర్ఆర్' అప్‌డేట్...కొత్త షెడ్యూల్ షురూ! - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ అప్‌డేట్…కొత్త షెడ్యూల్ షురూ!

January 21, 2020

raaaa02

బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్‌’. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ షూటింగ్‌కు వచ్చి కలిశాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. రాజమౌళిని కలిసిన అజయ్ దేవగన్ నేటి నుంచి షూటింగ్‌లో భాగం కానున్నాడు. 

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తెలంగాణా సాయుధ పోరాట యోధుడు కొమరం భీంగా నటిస్తుండగా, రామ్‌చరణ్‌ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా హాలీవుడ్‌ నటి ఒలివియా మోరీస్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.