MM శ్రీలేఖ పేరుకే పెద్ద కుటుంబం కానీ ఇప్పటివరకు సరైన ఒక్క సినిమా కూడా పడలేదని అంటుంటారు. సొంత కష్టంతోనే 80కిపైగా సినిమాలకు సంగీతం అందించిన శ్రీలేఖ కొన్ని వందల పాటలు కూడా పాడారు. అయితే ఈమె రాజమౌళికి చెల్లి వరుస కూడా. రాజమౌళి మాత్రం తన సినిమాలకు వరుసగా MM కీరవాణికే అవకాశం ఇస్తుంటారు. ఈ విషయంపై అప్పుడప్పుడు ట్రోల్స్ కూడా వస్తుంటాయి. రాజమౌళి కుటుంబంతో శ్రీలేఖకి విభేదాలు ఉన్నాయని.. అందుకే తన సినిమాల్లో మ్యూజిక్ అవకాశం ఇవ్వరని.. కనీసం తెలిసిన వారికి రికమండ్ కూడా రాజమౌళి చేయడని వచ్చే కథనాలపై తాజాగా స్పందించింది మ్యూజిక్ డైరెక్టర్ MM శ్రీలేఖ.
శ్రీలేఖ మాట్లాడుతూ.. మా కుటుంబం మొత్తం కూడా వర్క్ పరంగా అయితే ఎవరి పని వాళ్ళదే. కుటుంబ పరంగా మాత్రం మేము అందరం కలిసే ఉంటాం. కానీ ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఇవ్వాలి అనేది దర్శకుడుగా మ్యూజిక్ డైరెక్టర్గా మా అన్నయ్యల సొంత నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నేను వారికి ఉపయోగపడతాను అంటే అందులో ఏమాత్రం సందేహించకుండా అవకాశం ఇస్తారు.
ఇక అన్నయ్య రాజమౌళి కీరవాణి గారి కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆ కాంబినేషన్ వదులుకుంటారని అనుకోను. రాజమౌళిని అన్నయ్యకి ఎప్పుడు ఎవర్ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు అంటూ కాస్త సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఇక తనకి ఎవరు అవకాశం ఇవ్వకున్నా సొంతంగా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించాను అంటూ చురకలు అంటించిది MM శ్రీలేఖ. అయితే తమ కుటుంబాల మధ్యలో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు అని కూడా శ్రీలేఖ తెలియజేశారు.