ఆర్ఆర్ఆర్ సాధించిన విజయంతో మంచి జోష్ లో ఉన్న దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచర్ తరహాలో సినిమా ఉంటుందని ఇప్పటికే లీకులు వచ్చేశాయి. హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తారనే టాక్ నడుస్తోంది. దాంతో అమెరికాలో మహేశ్ సినిమాకు మార్కెటింగ్, పబ్లిసిటీ మీద కాన్సన్ ట్రేషన్ చేశాడు జక్కన్న. హాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ అవసరమైనప్పుడు పనిలో పనిగా తన తదుపరి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు.
అటు కీరవాణి కూడా ఇదే విషయం స్పష్టం చేయడంతో మహేశ్ మూవీపై అక్కడ కూడా అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇక రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పడంతో ఇదొక ఫ్రాంచైజీగా రూపొందించనున్నారని రూమర్లు వస్తున్నాయి. ఫిబ్రవరిలో ప్రిపొడక్షన్ పనులు మొదలవుతాయని అంటున్నారు. ఇదంతా ఒకెత్తయితే ఈ సినిమా ద్వారా రాజమౌళి భారీ టార్గెట్ ఫిక్స్ చేశారని సమాచారం. ముఖ్యంగా మహేశ్ సినిమాకు కలెక్షన్లు కొల్లగొట్టడానికి సిద్ధమవుతున్నాడు. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఎంతలేదన్నా ఒక బిలియన్ డాలర్లను రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారంట. అంటే మన కరెన్సీలో 8 వేల కోట్లు. ఇప్పటివరకు బాహుబలి 2, దంగల్ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 2 వేల కోట్ల వరకు కలెక్ట్ చేశాయి. ఇప్పుడు తెలుగు సినిమాకు హాలీవుడ్ మార్కెట్ జత అవుతుండడంతో ఈ టార్గెట్ రీచ్ కావడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే భారత సినీ చరిత్రలో కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.